మంత్రి పదవిని ఇస్తానంటే
మూలుగు తున్న వెందుకు
ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు
దేశ సంపద దోచుకున్న
మంత్రి మండలి లోన నేను
దేశ ద్రోహం చేస్తున్న పాలక వర్గం
లోన నేను
దేశ సమైక్యతా దెబ్బ తీసిన మిత్ర పక్షం
లోన నేను
సభ్యునిగా చేర లేక
దేశ భవితను తలచు కుంటూ
మూలుగు తున్నా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు
ప్రధాన మంత్రిని చేస్తానంటే
పారిపోతా వెందుకు
ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు
మంత్రి మండలి దోచుకున్న
దేశ సంపద మొత్తమేన్తని
సుప్రీం కోర్టు అడుగుతుంటే
చెప్పటానికి నోరు రాక
సిగ్గుతో తలదించు కుంటూ
పారి పోతా నందుకు
అందుకు అందుకు
అందుకోయి అందుకు
గృహ మంత్రిని చేస్తానంటే
గాబరా పడతా వెందుకు
ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు
దేశ ద్రోహులను కాపాడమని
సర్కారు నన్ను ఆజ్ఞాపిస్తే
దేశ ద్రోహం చెయ్యలేక
ప్రజలు మొఖము చూపలేక
గాబరా పడ్డా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు
రక్షణ మంత్రిని చేస్తానంటే
రభస చేస్తా వెందుకు
ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు
బోఫోర్స్ గన్ను కుంబ కోణం లో
రాజీవ్ గాంధీ వాటా ఎంతని
సి బీ ఐ కోర్టు నిలదీస్తే
నిజము చెప్పే దమ్ము లేక
నీళ్ళు నములుతూ నిలువ లేక
రబస చేశా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు
టెలి కామ్ మంత్రిని చేస్తానంటే
టారు ఎత్తావెందుకు
ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు
టు జీ స్పెక్ట్రం కేసు లోన
లక్ష కోట్లను స్వాహా చేసిన
రాజా గారి రాజసమును
పార్లమెంటు లో ప్రతి పక్షమడిగిన
పలు ప్రశ్నలకు జవాబు లేక
టారు ఎత్తనందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు
ఎనుబది సంవత్స్తరముల
కాంగ్రెస్ పార్టీ పాలనలోన
దేశ చరితను తిరగ రాసిన
ఘనమైన చరిత్ర కలిగిన
సర్కారులోన చేర మంటే
కుమిలి పోతా వెందుకు
ఎందుకు ఎందుకూ
ఎందుకోయి ఎందుకు
ఈ ఎనుబది సంవస్తారాలలో
పేద వాడి బ్రతుకు తోటి
వారు ఆడిన నీచమైన
రాజకీయం తలచుకుంటూ
తలచు కుంటూ తల దించు కుంటూ
కుమిలి పోయా నందుకు
అందుకు అందుకూ
అందుకోయి అందుకు
Sunday, February 6, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment